రాహుల్ చేసిన ఆ పోస్ట్ తన కోసమేనా!
on Sep 21, 2023
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ హౌజ్ లో కొనసాగడానికి చాలా తిప్పలే పడుతున్నారు. ఎవరికి వారు స్ట్రాటజీ ప్లే చెయ్యడంలో వంద శాతం సక్సెస్ అవుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కంటెస్టెంట్స్ ప్రేక్షకుల సింపతీ పొందాలి. అలా అయితేనే హౌజ్ లో ఎక్కువ రోజులు ఉంటామన్న భ్రమతో ఇప్పుడున్న వాళ్లు అనుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ, అట సందీప్ తప్ప మిగతావాళ్ళంత ఏదో ఒక సింపతీతో కంటెంట్ ఇవ్వాలని, స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని చూస్తున్నారు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం హౌజ్ లో ఎప్పుడు ఒక ఎమోషన్ తో ఉంటూ వస్తుంది మన రతిక బేబీ. మొదటి వారంలోనే మీరు ఎవరినైన మిస్ అవుతున్నారా అని బిగ్ బాస్ అడిగినప్పుడు.. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్ననంటూ చెప్పుకొచ్చింది రతిక. మొదటి వారంలో పల్లవి ప్రశాంత్ లక్కీ ఛామ్ బ్యాండ్ ని రతికకి కట్టడంతో మొదలైన వారి రిలేషన్.. రోజు రోజుకి పీక్స్ కి వెళ్తుంది. ఇప్పుడు తాజాగా రతిక ఖాతాలో మరొక బకరా చేరాడు. అది ఎవరో కాదు ప్రిన్స్ యావర్. అతనికి తెలుగు రాదు, ఈమెకి హిందీ రాదు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ని వెనుక తిప్పుకొని నామినేషన్లో వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు తాజాగా యావర్ ని సపోర్ట్ చేస్తానని చెప్పి సీక్రెట్ రూమ్ లో యావర్ అనర్హుడని చెప్పింది. ఇదంతా చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు ఇప్పటికే రతికని.. డీజే టిల్లు సినిమాలోని రాధిక తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
రతిక మాజీ ప్రియుడు అంటే ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అయితే అతని ఫ్యాన్ బేస్ ని తనవైపుకు తిప్పుకోవడానికే రతిక ఆడుతున్న డ్రామా అని అదంతా ఫేక్ అని రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశాడు. ' ఫేక్ సింపతీ గేమ్ ఎప్పటివరకు? అందరు తమ సొంత ట్యాలెంట్ మీద ఆధారపడి తమని తాము నిరూపించుకుంటారు. కానీ కొంతమంది ఇతరుల ట్యాలెంట్ ని పేరుని వాడుకొని నటిస్తుంటారు. ఫేమ్ కోసం అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. లోపల ఉన్న పర్సన్ కి ఆల్ ది బెస్ట్. పైసల్ తీసుకొని తనకి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న పేడ్ బ్యాచ్ కి కంగ్రాట్స్' అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ తనకోసమే అని చాలామందికి ఇప్పటికే తెలిసిపోయింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
